తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.

కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని పెంపొదించడానికి కృషి చేస్తున్న e-తెలుగు, బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) కూడా తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడానికి, గుర్తు చేయడానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సరైన సందర్భం! ప్రజలందరూ పాల్గొనడానికి వీలుగా సెలవు రోజైన ఆదివారం ఆగస్టు 28 నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

తెలుగు భాషా దినోత్సవం

గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని (ఆగస్టు 29) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది.

ప్రచారం

మీరు తెలుగుబాటకి వస్తున్నట్టు మీ బ్లాగులో పదర్శించండి.
తెలుగు బాటకి నేను వెళ్తున్నాను!

పై బొమ్మ కోసం మీరు ఈ కోడుని ఉపయోగించవచ్చు:

<p><a href='http://telugubaata.etelugu.org/'>
	<img src='http://telugubaata.etelugu.org/telugubaata-promo-nenuveltunnaa.png' 
		alt='తెలుగు బాటకి నేను వెళ్తున్నాను!' style='border:none;'/>
</a></p>

నమోదు చేసుకోండి!

ప్రవేశం ఉచితం. మీకు తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటే, మా నమోదు ఫారాన్ని పూరించండి. నమోదు ఫారం

మీరు తెలుగు కోసం తపించే వారైతే మాతో కలవండి. మాతో నడవండి!

సంప్రదింపులు

తెలుగు బాట గూగుల్ గుంపు

మీ స్నేహితులని కూడా వెంట తీసుకునిరండి!

తెలుగు బాట కార్యక్రమం గురించి బజ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో మీ స్నేహితులకి పరిచయం చేయండి.

రండి, తెలుగు విప్లవంలో పాలుపంచుకోండి!